Asankhya banner

వెన్నెల

telugu
archive
కవితలు
ఆ నెలరేని వన్నెలే - వెన్నెల ఆ చిన్నెలు వర్ణింప, వర్ణములెల్ల తెల్లబోవా? ఆ అర్ధచందురిని ఆర్ద్రము
Author

Soma S Dhavala

Published

December 7, 2008

పొగడిన పెరుగు,
తెగడిన తరగు,
తరచి చూడ తెరమరుగౌ
ఆ నెలరేని వన్నెలే - వెన్నెల
ఆ చిన్నెలు వర్ణింప,
వర్ణములెల్ల తెల్లబోవా?
ఆ అర్ధచందురిని ఆర్ద్రము
అవగతమవ్వని తారలు, వెలవెలబోవా?