సమోసా : వహ్ క్యా బాత్ హై
telugu
archive
పద్యాలు
ఇది బహుళ జనాభిప్రాయమే కదా! మరి ఆటవెలది లో సమోసాపై పద్యం చూడండి: దట్టముగను, కట్టుదిట్టముగను పిండి
ఇది బహుళ జనాభిప్రాయమే కదా! మరి ఆటవెలది లో సమోసాపై పద్యం చూడండి:
ఆ.వె
దట్టముగను, కట్టుదిట్టముగను పిండి
పొట్టనాలుగడ్డ, పోవునంత
ఉల్లిగడ్డ, బాగమఱిగినానూనెలొ,
వేగినా సమోస, వడిగతినుము! ||
ఎందుకు అంటారా, ఆలసించినఆశాభంగం
ఎందులకింకెందులకీ సమాలోచనలు
సాలు, సాలు, రసాలూరు సమోసాలు!
అంటూ సమోసాలు తింటూ బ్లాగులు చదువుకోండి :).
పై పద్యం మొన్న potluck dinner లో మా అందరికీ సమోసాలు చేసిపెట్టిన భానువాళ్ళ అమ్మగారికి అంకితం
ps: పెద్దలు వ్యాకరణ దోషాలు ఉంటే సూచించగలరు.