దద్దోజనం మీద
telugu
archive
పద్యాలు
గుమ్మపాల పెరుగు, కమ్మని తాళింపు మేళవించినన్నమె గద, విందు లందు జిహ్వనాడులచెలి దద్దోజనం తన్నెఱగని జనము దద్దు జనమె!
ఆ.వె
గుమ్మపాల పెరుగు, కమ్మని తాళింపు
మేళవించినన్నమె గద, విందు
లందు జిహ్వనాడులచెలి దద్దోజనం
తన్నెఱగని జనము దద్దు జనమె!
భావం:
గుమ్మపాలుతోడుపెట్టిన గడ్డపెరుగు అన్నంకి,
ఎండుమిరప, శనగపప్పు ఇత్యాలుదలతో పోపు ( తాళింపు) పెడితే, రుచిని గ్రహించే నాడులకి ప్రియమైన దద్దోజనం సిద్ధం.
ఇంతవరకూ భోజనంలో దద్దోజనం తినని జనం, నిజంగా దద్దు (నిర్భాగ్య) జనం సుమీ! :)
గమనిక:
1)ఇది సరదాకి రాసినది, ఆటవెలదితో కూస్తీలో భాగంగా!
2)వ్యాకరణంలో దోషాలున్న తెలుపగలరు.