ఆంధ్రామృతం దత్తపూరణం
telugu
archive
ఆచార్యులు చింతా రామకృష్ణారావు గారిచ్చిన దత్తపూరణం “అక్క, చెల్లె, బావ, అన్న” అన్న పదాలతో “రామాయణానికి” సంభందించి ఒక పద్యం రాయాలి. నేను చేసిన ప్రయత్నం ఆటవెలది లో:
ఆచార్యులు చింతా రామకృష్ణారావు గారిచ్చిన దత్తపూరణం
“అక్క, చెల్లె, బావ, అన్న” అన్న పదాలతో “రామాయణానికి” సంభందించి ఒక పద్యం రాయాలి. నేను చేసిన ప్రయత్నం ఆటవెలది లో:
ఆ.వె:
“బావ” యనుచు వెంటపడిన రావణుచెల్లె
లముకుచెవులు కోసె లక్ష్మణుండు
అక్కసుతొవెడెలెను రక్కసి “అమ్మా! హు”
అని వగచుచు చేరెనన్న దరికి
ఇందులో, “బావ యనుచు వెంట పడిన” అన్న ప్రయోగం కొంచం వాడుకభాషకి దగ్గరలో ఉంది. దీని ఇంకాబాగా రాస్తే బావుణ్ణు. కానీ ఛందస్సుతో పని కాబట్టి నాకింకా అంత భావస్వేచ్ఛ రాలేదు. ప్రస్తుతం ఛందసు కోసమే ప్రయాస పడాల్సి వస్తొంది.
ఆచార్యులు కొన్ని తప్పులు సవరించారు. వాటిని comments లో చూడగలరు.