Asankhya banner

రేయి మించెనోయీ రాజా (పేరడీ video)

telugu
archive
వీడియోలు
సినీమా
రేయి మించెనోయీ రాజా, హాయిగ నిదురించరా, ఆ …..హాయిగ నిదురించరా వెన్నెల్లు విరెసె, వెతలెల్ల వెలిసె
Author

Soma S Dhavala

Published

March 21, 2009

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ …..హాయిగ నిదురించరా
వెన్నెల్లు విరెసె, వెతలెల్ల వెలిసె
ఆశల తారలు మిలమిల మెరిసె
తలపుల్లో నీవు, జలకమ్ములాడి
విందారగింపా విచ్చేయవోయి
మమతల్లు కలుపు, మాయల్లు విరుపు
దూరాలు తరగు, మురిపాలు పెరుగు
హాయిగ నీవింక సేవించవోయీ
రేయి ||
సిరులూ, విరులూ, మనకేలనోయి,
రాగం, అనురాగం మనవేకదోయి
కన్నుల్లు మూసి, మనసే తెరచి
కలలేకంటూ విహరించవోయీ
హార్ధికమాంద్యం కలలకుకాదు
కలలకు కొఱతంటు రానేరాదు
హాయిగ నీవింక శయనించవోయి
రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ …..హాయిగ నిదురించరా
ఉమ్…..ఊమ్….. ఊ….ఊ…….
ఈపాట వీడియో రూపంలో ఇక్కడ చూడండి

రచన: దీపిక ఆచళ్ళ, సోమశేఖర్ ధవళ
గాత్రం: దీపిక ఆచళ్ళ
స్వరకల్పన: ఘంటసాల
మాతృక రచన: సముద్రాల
చిత్రం: శభాష్ రాముడు
నేపధ్యం:
నేను, దీపిక (మా ఆవిడ) కలిసి సాయంత్రం “నడక” కని బయలుదేరాం (ఇలా వాకింగ్ కి వెళ్ళడం, జీవితంలో నాకు ఇదే మొదటిసారి). కాస్త దూరం నడిచిన తరువాత, ఏదైనా పాటపాడొచ్చు కదా అని దీపికని ఆడిగాను. సరే అయితే, మీకిష్టమైన “శభాష్ రాముడు” లోని “రేయి మించెనోయి రాజా” పాడతాను అని మొదలుపెట్టాకా, ఇంక ఆపాటకి పారడి మొదలుపెట్టాను (నాకు అంత్యాక్షరీల్లో, ఇలా పాటలని ఖూనీ చెయ్యడం బాగా అలవాటూ). అది ఇలా మొదలయ్యింది
“అలసి సొలసి, ఆయాసం వచ్చి,
త్వరగా ఇంటికి పోదామురండి” అని మాఆవిడ అంటే
“పోపే పోచి, చారే కాచి
వేడిగా ముద్దే తిందాము రండి” అని నేను,
ఇలా కామెడీగా మొదలయ్యి, పైన రాసిన విధంగా రూపాంతరం చెందింది.