Asankhya banner

మల్లెల మాలలూగక మానునా, మాయునా?

telugu
archive
కవితలు
మల్లీశ్వరి సినిమాలో “మనసున మల్లెల మాలలూగెనే” పాట ఏమాత్రం అభిరుచి ఉన్న శ్రోతలకైనా తెలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన తెలుగు సొగసుల సిరి మల్ల…
Author

Soma S Dhavala

Published

April 19, 2009

మల్లీశ్వరి సినిమాలో “మనసున మల్లెల మాలలూగెనే” పాట ఏమాత్రం అభిరుచి ఉన్న శ్రోతలకైనా తెలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన తెలుగు సొగసుల సిరి మల్లెల మాలలు ఆ సినిమాలోని మాటల పాటలు, పాటల ఆటలు.
వారి మేనకోడలు, అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు ఎన్నో జానపద గీతాలని ఆంధ్రదేశమంతా తెరిగి, వెతికి పట్టి, బాణీలు కట్టి, స్వరబద్ధం చేసినవారుగా చిరపరిచితులు. వారి కృషిని మెచ్చి, ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు “కళాప్రపూర్ణ” బిరుదుతో ఆవిడని సముచితంగా సత్కరించారు. వారిని 22 వ టెక్సాస్ తెలుగు సాహితీ సభల సందర్భంగా కలవడం జరిగింది. ఆవిడ మాట్లాడుతూ కొన్ని ఆశక్తికరమైన విషయాలని చెప్పారు. మల్లెశ్వరి లో, “నోమీ నోమన్నలాలొ” పాటకి, అలాగే “మనసున మల్లెల” పాటకి కూడా, బాణీలు ఆవిడే సమకూర్చేరుట (కానీ సినిమాలో రాజేశ్వరరావు గారీ పేరే కనబడుతుంది). అందుకే
కృష్ణశాస్త్రి విరచితమవ్వంగ
వింజమూరి రసస్వర వింజామరలు
విసురుగ విసరంగ, మనసున మల్లెల మాల
లూగక మానునా, మాయునా!
ఆవిడ కుటుంబానికి ఎంతోమంది పేరిన్నిక గల కవుల ( విశ్వనాధ, కొకు, శ్రీశ్రీ, చలం…) తో ఉన్న సన్నిహిత భాంధవ్యాల గురించి, ఆవిడ స్వంతమాటల్లొ ఇక్కడ వినండి (నిడివి 19 ని||)

Embedded media legacy link

(ఆ గొంతుక విన్నవారెవ్వరు, ఆవిడకి 89 సంవత్సరాలంటే నమ్మకపోవచ్చు)