ముక్కుపుడక - అసూయ
telugu
archive
పద్యాలు
చక్కగ చెక్కిన, పసిడి ముక్కెరనిడ, మక్కువ పద్మనాధుని కాంతులిడి, తళుక్కుమనెనె, అప్ప్రకాశంబునన్, మ్రుక్కునవ్రేలిడు అమ్మలక్కల
ఛ.లే.ప||*
చక్కగ చెక్కిన, పసిడి ముక్కెరనిడ,
మక్కువ పద్మనాధుని కాంతులిడి, తళుక్కుమనెనె,
అప్ప్రకాశంబునన్, మ్రుక్కునవ్రేలిడు అమ్మలక్కల
లక్కసునసూయలు గోచరించెను సుస్పష్టముగనున్
బంగారంపు ముక్కుపుడుక పై ముచ్చటపడి
పద్మనాధుడు అంటే, సూర్యుని కిరణలు పడగానే
ఆ ప్రతికిరణాల ప్రకాశంలో, వెలుగులో, మిగతా అమ్మలక్కందరి
అసూయ, ఈర్ష్యలు స్పష్టంగా కనిపించాయి
* ఛ.లే.ప - ఛందస్సు లేని పద్యం :)