రాముడు. ముదమున ఖురాను చదివె
telugu
archive
పద్యాలు
శంకరాభరణం బ్లాగరి ఆచార్య కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణం 1. రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే
శంకరాభరణం బ్లాగరి ఆచార్య కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణం
1. రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే
నా పూరణ
ఉ||
క్షామముతోడిరాజ్యమున గద్దలు భిక్కుల భక్షమైననూ
కామమదమ్ములందు గురిగల్గిన శిక్షకులుండుటే నిజం.
క్షేమము లేనియా వికృతకేంద్రములో దయ విస్మరించి యా
రాముని జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడరే
2. రాముడు ముదమున ఖురాను చదివె
నా పూరణ
కం||
నరలోకపు భూకబ్జా
సురులంతంబొందగ సురసురమని విడిచెన్
శరములు రాముడు. ముదమున
ఖురాను చదివెను రహీము కుశలము తోడన్.