Asankhya banner

కర్ణ బంధ కందం - (సెగటు/Bishop move)

telugu
archive
పద్యాలు
చ‘తురంగ’గతి బంధ కందము ఇక్కడ. మరి వెరే ఏరకంగా ప్రయత్నంద్దాం అనుక్కుంటే, కర్ణం (main diagonal) తీసుకుంటే అనిపించింది.
Author

Soma S Dhavala

Published

August 25, 2010

చ‘తురంగ’గతి బంధ కందము ఇక్కడ. మరి వెరే ఏరకంగా ప్రయత్నంద్దాం అనుక్కుంటే, కర్ణం (main diagonal) తీసుకుంటే అనిపించింది.
కం||
లలితపద వనరుహనయని,
జలధిని సమకొను సురసరజని, విభుని తపం
బులను, ధిషణు వచనమునను
పులకరములు బడయునటుల పురిగొలుపు భువిన్.
ఎఱ్ఱరంగులో ఉన్నవి న్యస్తాక్షరాలు. పద్యాన్ని, 8 x 8 మాత్రిక గా అమరిస్తే,
ల లి త పద వ న రు
హ న య నిజ ల ది ని
స మ కొ నుసు ర స ర
జ ని వి భుని త ప ౦
బు ల ను ధిష ణు వ చ
న ము న ను
పు ల క ర
ము లు బ డయు న టు ల
పు రి గొ లుపు భు వి న్
కర్ణ బంధం కావించబడ్డ వాక్యం (బలిసిన మనుజుల) “రుధిర నిధి నలుపు”. చదరంగం బోర్డులో సెగటు నడక, మొదటి గడి top,right corner (r1,c8)లో మొదలయ్యి (r2,c7),(r3,c6),.., .లమీదుగా సాగి (r8,c1) దగ్గర ముగుస్తుంది.
బంధకవిత్వం is like watermarking/cryptography. What I tried in particular here is to bring some contrast between the poem and its watermark.